** TELUGU LYRICS **
ఆహా! జగమంతా ఆనందం కురిసే
ఓహో! జనమంతా మైమరచి మురిసే (2)
ఓహో! జనమంతా మైమరచి మురిసే (2)
దైవతనయుడే దీన జనులపై కరుణ కురిపించే
లోకరక్షకుడై బెత్లేహేమున శిశువై ఉదయించే
యేసు మనకై పుట్టేనంట హల్లేలూయ
రక్షణ మనకు తెచ్చేనంట హల్లెలూయ
పాపపు దాస్యములో నలిగే మనలనుచేరి
చీకటి బ్రతుకులలో వెలిగే జ్యోతిగా మారి
శుద్దహృదయాన్ని
నిత్య జీవాన్ని మనకు కలిగించగా
పాప భారాన్ని నిత్య నరకాన్ని దూరం తొలగించగా
యేసు మనకై పుట్టేనంట హల్లేలూయ
రక్షణ మనకు తెచ్చేనంట హల్లెలూయ
||ఆహా||
దేవుని పిల్లలుగా ఎదిగే భాగ్యమునిచ్చి
ఆయన రాజ్యములో నిలిచే వరమును ఇచ్చి
సత్య వాక్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని మనకు బోధించగా
సత్య మార్గంలో నిత్యం నడచుటలో మాదిరి చూపించగా
యేసు మనకై పుట్టేనంట హల్లేలూయ
రక్షణ మనకు తెచ్చేనంట హల్లెలూయ
దేవుని పిల్లలుగా ఎదిగే భాగ్యమునిచ్చి
ఆయన రాజ్యములో నిలిచే వరమును ఇచ్చి
సత్య వాక్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని మనకు బోధించగా
సత్య మార్గంలో నిత్యం నడచుటలో మాదిరి చూపించగా
యేసు మనకై పుట్టేనంట హల్లేలూయ
రక్షణ మనకు తెచ్చేనంట హల్లెలూయ
||ఆహా||
----------------------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals : Tinnu Thereesh
Lyrics & Music : Joshua Katta & Harsha Singavarapu
----------------------------------------------------------------------------------