5311) అడుగువాటికంటె ఊహించు వాటికంటె

** TELUGU LYRICS **

అడుగువాటికంటె
ఊహించు వాటికంటె
అధికముగా మేలు చేయు
దేవుడు యేసు దేవుడు

నమ్ముట వల్లైతే సమస్తము సాధ్యము
ప్రార్ధించునప్పుడె నమ్ముటే
పొందుటకు సూత్రము       

ఊహించాడా అబ్రాము
లెక్కలేనంత సంతానం 
ఊహించిందా శారాయి 
వృద్ధాప్యమందు గర్భఫలం 
ఊహించాడా బానిస యోసేపు
దేశమంతటిపై అధికారం 
ఊహించాడా భక్త యోబు
రెండంతల ఆశీర్వాదం 
||నమ్ముట వల్లైతే||

ఊహించారా విందు చివరలో
మధురమైన ద్రాక్షారసం
ఊహించారా చేపలు రొట్టెలు 
వేలుగ తినిననూ మిగలడం
ఊహించారా శిష్యులు 
వలలలో చేపలు విరివిగ పడడం
ఊహించారా చేప నోటిలో
వింతగ షెకెలు ను దాచటం 
||నమ్ముట వల్లైతే||

ఊహించాడా నెబుకద్నెజరు
దానియేలు బ్రతికుండడం
ఊహించాడా గొల్యాతు
దావీదు చేతిలో చావడం
ఊహించారా దేవుని ప్రజలు
దూతల ఆహారము తినడం
ఊహించగలవా పరలోకములో
జీవ వృక్ష ఫలమును తినడం
||నమ్ముట వల్లైతే||

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------