5312) అందమైన ఆశలే పెళ్లి పందిరులై

** TELUGU LYRICS **

అందమైన ఆశలే పెళ్లి పందిరులై
సుజీవనానురాగాలే మేళ తాళాలై
వరుడు ప్రేమ పత్రికై 
వధువు విధేయ పుత్రికై 
నూరేళ్ళ భవితకై 
ఏతెంచెను ఏకమై 

ప్రమాణాలే సాక్షిగా ఒకరికొకరు తోడుగా 
క్రీస్తేసు చిత్తమై జరుగుతున్న పరిణయం 
సర్వలోక నాథుడే మీ రక్షణవ్వాలని 
తల్లిదండ్రుల ప్రార్థన దైవజనుల దీవెన 
పెద్దలందరి కోరిక మీ కలయిక 

పరిశుద్ధాత్ముని సాక్షిగా వేరు పడని జంటై 
దాంపత్య యాత్రలో వేరు పారే తోటై 
సమృద్ధికి నిలయమై వర్ధిల్లాలి 
పసిడి కాంతుల గృహముగా తేజరిల్లాలి 
దివ్యుడేసుని మహిమలో మీరు ఫలియించాలి

---------------------------------------------------------------------------------------
CREDITS : Angel Atmani, Ravi Shankar, Sandeep Kumar
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------------------------------