** TELUGU LYRICS **
యేసూ నీవే నను చూచి - పేరుపెట్టి పిలిచి
నా జీవితము నీ చేతులలో భద్రముగా దాచి
అ.ప: నను దీవించావే - నా ప్రియ తండ్రివి నీవే
నా జీవితము నీ చేతులలో భద్రముగా దాచి
అ.ప: నను దీవించావే - నా ప్రియ తండ్రివి నీవే
నేను ఏర్పడక ముందే నీవు నన్ను ఎరిగియున్నావే
జ్ఞానముతో పెంచావే - ఉన్నతంగ ఉంచావే
తప్పులన్ని క్షమియించుచూ నను చక్కపరచినావే
నేను ఏడవక ముందే నీవు నన్ను కలుసుకున్నావే
ఆదరణ ఇచ్చావే - మంచిచేయ నేర్పావే
అడ్డులన్ని తొలగించుచూ నను ముందు నిలిపినావే
నేను ఏమనక ముందే నీవు నన్ను పలకరించావే
దీపముగా మార్చావే - కాంతి పంచమన్నావే
చింతలన్ని భరియించుచూ నను ధైర్యపరచినావే
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Dr. A.R.Stevenson
Vocals : Alethia Yama, Levia Carla Yama
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------------