5220) నీ దయలో నీ కృపలో ఇంతకాలము నన్ను కాచితివే

** TELUGU LYRICS **

నీ దయలో నీ కృపలో ఇంతకాలము నన్ను కాచితివే - ఎంతో ప్రేమతో
నీ యెదలో దాచితివే యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమ చాలయ్యా నాకు చాలిన దేవుడా - 
నీ తోడు చాలయ్యా, నన్ను విడువని దేవుడా
||నీ దయలో||

అనుదినము నా భారమును భరియించిన నా నాధుడా 
కన్నతండ్రివై నీవు నన్ను - నీ కౌగిట దాచిన దేవా 
నీ దయలో నన్ను నిలిపి నా యెడల నీ కృప చూపినావే
||యేసయ్యా||

నా బాధలో ఓదార్పుగాను నన్ను ఆదరించిన దైవమా
నా ప్రాణములో ప్రాణమై నీవు నాలో నివసించిన నాధుడా
నా శ్రమలో ఆశ్రయమై నీ దయలో నీదరిచేర్చినవే
||యేసయ్యా|| ||నీదయలో||

---------------------------------------------------
CREDITS : Pst Israel Garu
Music : Jk Christopher 
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------