5250) యేసు నాధా నీవే దైవం యేసు నాధా నీవే ఆశ్రయం

** TELUGU LYRICS **

యేసు నాధా - నీవే దైవం 
యేసు నాధా - నీవే ఆశ్రయం 
యేసు నాధా - నీవే శైలము 
నా కోటయు - నీవు మాత్రమే

స్తుతించెదను - అత్యున్నతుడా
భూమ్యాకాశముల్ - సృజించితివే 
మహిమకు పాత్రుడా - స్తుతులకు యోగ్యుడా  
ఘనత ప్రభావము - యేసు నీకే

స్తుతించెదను - మహోన్నతుడా
వర్ణింపతరమా - నీ కార్యముల్
మహిమకు పాత్రుడా - స్తుతులకు యోగ్యుడా 
ఘనత ప్రభావము - యేసు నీకే

కీర్తింతును - నా యేసు నాధా 
నీవంటి వారు - లేనే లేరు
మహిమకు పాత్రుడా - స్తుతులకు యోగ్యుడా
ఘనత ప్రభావం - యేసు నీకే

------------------------------------------------------------------------------------------------
CREDITS : Original Malayalam Lyrics: Sam Padinjarekara
Telugu Lyrics : Dr Luke & Dr Prathyusha
Original Composition & Music : Denilo Dennis & Moses Dany
------------------------------------------------------------------------------------------------