5251) సాగరముపై నడిచిన యేసు నీకే

** TELUGU LYRICS **

సాగరముపై నడిచిన యేసు నీకే 
సాగరమునే అణిచిన యేసు నీకే 
స్వస్థతలెన్నో చేసిన యేసు నీకే 
సమస్తము నాకై చేసిన యేసు నీకే 
ఈ క్షణం నిను తలచుట భాగ్యమే..
నా హృదయం స్తుతియించుట యోగ్యతే (2)
ఓ... ఓ...ఓ...
అద్వితియుడా నీకే ఆరాధనా 
ఓ... ఓ...ఓ...
రాజుల రాజువు నీకే స్త్రోత్రపణా (2)

శోధనా వేదనా - వెన్నంటియున్న 
నా అడుగుల్లని వెనకడుగులైన 
నా దేహమంతా క్షీణించుచున్న 
ఓటమే నాకు శరణం అయ్యినా  
ఆదరించే యేసు నీవే వెన్నుతట్టి నడిపించగా 
అవధులు లేని యేసుని ప్రేమ నిరతము నాపై చూపగా (2)
సాధించలేనిది ఏది యేసు నీవుండగా నా తోడుగా
సాధించలేనిది ఏది యేసు నా పక్షమున నీవే నిలువగా (2)   
||ఓ... ఓ...ఓ...||

ఏమివ్వలేని అల్పుడను నేను 
ప్రేమించినావు దరిచేరినావు 
నా పాప భారం నీవు మోసినావు 
నా కొరకు నీవే బలిఅయినావు  
యేసయ్య జీవముగల దేవా నీవు నాలో జీవించగా
వెలుగువై మార్గమును చూప నీకు సాక్షిగా నేనిలువగా (2)
సాధించలేనిది ఏది యేసు నీవుండగా నా తోడుగా
సాధించలేనిది ఏది యేసు నా పక్షమున నీవే నిలువగా (2) 
||ఓ... ఓ...ఓ...||

---------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : R. Daniel Praveen 
Vocals & Music : Sushanth Karem, R. Daniel Praveen & Shalom Raj 
---------------------------------------------------------------------------------------------------------