5276) ఉన్నతమైన కృపా ఊహించలేని కృపా

** TELUGU LYRICS **

ఉన్నతమైన కృపా ఊహించలేని కృపా 
మా బ్రతుకులలో చేశావు నీవు 
మా స్థితిగతినే మార్చావు నీవు ఏమని వివరించగలము 
మా పైన నీ కున్న ప్రేమను 
యేసయ్య యేసయ్య నీవే నా కాపరి 
యేసయ్య యేసయ్య నీవే నా ఊపిరి

ఈ లోకాన స్థితి ఏదైనా అవసరములు తీర్చినావు
మా కన్నులలో కాంతులు నింపే నిజమైన స్నేహితుడవు
నీ ప్రేమే అపారము 
నీ గుణమే దయాగుణం 
మా నిత్య నివాసం నీవయ్యా
నీ దివ్య చరితయే చాలయ్య 
||యేసయ్య||

మా పక్షముగా నిలబడినావు ధైర్యముతో నింపినావు 
నూతన క్రియలు ఎన్నో చేసి మమ్మును ప్రేమించినావు 
నీ కరుణే అనంతము 
నీ కృపయే నిరంతరం
దయచేసినావు మా యేసయ్య 
నిను పాడి స్తుతింతుము మేమయ్యా
||యేసయ్య||

------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Sunil kumar Yalagapati
Music & Vocals : Moses Paul & Sujatha Yalagapati 
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------------------