5267) నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశ

** TELUGU LYRICS **

నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశ 
నీతో ఉండాలని ఆశ నీతో నడవాలని ఆశ (2)
ప్రతిక్షణం నీతో గడపాలని 
ప్రతిదినం నీ ప్రేమలో మునగాలని (2)
ఆశ నాలో ఉపొంగుచున్నది యేసయ్యా
ఆశ నాలో ఉపొంగుచున్నది మెస్సయ్యా 

నా అన్నవారే నన్ను వెలివేయగా
నా స్నేహితులే నన్ను బాధించగా (2)
అండగా నిలిచి కన్నీరు తుడిచి
మితిలేని ప్రేమతో ఓదార్చినావుగా (2)
నీవు ఎంతైన నమ్మదగినవాడవు
బహు జాలిగలిగినా నా దేవుడవు (2)
 
నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావయ్యా 
నా పేరుపెట్టి నన్ను పిలిచావయ్యా (2)
పాపము మన్నించి శాపము తొలగించి
ఎనలేని ప్రేమను రుచి చూపినావుగా (2)
నీవు ఎంతైన నమ్మదగినవాడవు
బహు జాలిగలిగినా నా దేవుడవు (2)

------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Jeevan Wesley Olesu
Music & Vocals : Nimshi Zacchaeus & Krupanandhu Olesu
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------------------------------