5283) నీవిచ్చిన జీవితం నాకెంతో విలువైంది

** TELUGU LYRICS **

నీవిచ్చిన జీవితం నాకెంతో విలువైంది  
నువ్వు చూపిన మాదిరి ప్రపంచానికి ఆదర్శం
ఊహించలేను ప్రభువ నువ్వు లేని క్షణమైనా 
నువ్వు లేనిదేదైనా నేను ఆశింపలేనయ్యా
నీ ప్రేమ లేక నేను బ్రతకలేనయ్యా 
నీతోడు లేక నేను ఉండలేనయ్యా

ఏమున్న లేకున్నా నేను మరువ జాలనయ్యా 
ఏమున్న లేకున్నా నిను విడవలేనయ్యా

నలిగిన జీవితాలను వెలిగింప చేసే జీవాహారము  
జుంటి తేనె ధారల కన్నా మధురమైది నీ జీవ గ్రంథము 
ఎన్నెన్నో కార్యములు చేసితివయ్యా
నిను పొగడకుండా నీ బ్రతకలేనయ్యా
నీ వాక్యముకు హృదయములో చోటు ఇవ్వకనే 
నా పాపముతో నీ గాయం రేపితిన్నయ్య 
ఇంత ప్రేమ చూపుటకే నాకు అర్హత లేదయ్యా నా యేసయ్యా

బ్రతికి ఉన్నంతకాలం నా శేష జీవితాన్ని నీకర్పించి
ధరణియందంతటా/ధరణీయంతటా నీ నామమునే ప్రకటించెదనయ్యా
వెలకట్టలేని నీ ప్రేమను వర్ణించగాలనా 
నీ వాత్సల్యతకు సాక్షిగ నే నీలిచెదనయ్యా
ఇరుకు ఇబ్బందులే నన్ను చుట్టముట్టినా 
ఆదరించే దేవునిగా నీవు నిలిచావయ్యా
ఆ శాశ్వత లోకాన్న నాకొక స్థానమును ఉంచిన నా యేసయ్యా

---------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Ramesh Ponguleti
Vocals & Music : Nishanth Penumaka & Prasanth Penumaka
---------------------------------------------------------------------------------------------