5282) అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ఆదరణ కర్త నా యేసు దేవుడు

** TELUGU LYRICS **

అద్వితీయుడు ఆశ్చర్యకరుడు
ఆదరణ కర్త నా యేసు దేవుడు
నీతి సూర్యుడు నీతిమంతుడు
నిజమైన దేవుడు
నా యేసు దేవుడు  (2)
సమస్తమును - సమకూర్చే దేవుడు
సర్వజనులను - రక్షించే దేవుడు (2)

కన్న తల్లిలా ప్రేమించే దేవుడు
కంటిపాపలా కాపాడే దేవుడు (2)
దుఃఖ దినములు తొలగించే దేవుడు (2)
సంతోషంతో నింపే దేవుడు(2)
||సమస్తమును||

కష్ట కాలంలో కరుణించే దేవుడు 
శోధన నుండి తప్పించే దేవుడు (2)
కలిమి లేమిలో తోడుండే దేవుడు (2)
ఐశ్వర్యంతో నింపే దేవుడు (2)
||సమస్తమును||

ఓటమి అంచుల్లో గెలిపించే దేవుడు
మేలులతో తృప్తి పరిచే దేవుడు (2)
వ్యాధి బాధలు తొలగించే దేవుడు (2)
నూతన బలముతో నింపే దేవుడు (2)
||సమస్తమును||

----------------------------------------------------------------
CREDITS : Music : Suresh
Lyrics, Tune, Vocals : Bandela Naga Raju
----------------------------------------------------------------