5230) మహిమ స్వరూపిగా నా హృదిలో నిలిచిన యేసయ్య

** TELUGU LYRICS **

మహిమ స్వరూపిగా నా హృదిలో నిలిచిన యేసయ్య
నిన్ను స్తుతించడానికి నన్ను నిర్మించినావు నా దేవా
వందనం అభివందనం దేవ వందనం రాజవందనం

భూమిని ఒక మాటతో నిర్మించినావు నా దేవా
గాలిని తుఫానును గద్దించినావు నా ప్రభువా
నీకు అసాధ్యమైనది లేనే లేదు నా దేవా 
నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభువా
వందనం అభివందనం దేవ వందనం రాజవందనం
||మహిమ||

అగ్నిని ఒక మాటతో దింపినావు నా దేవా 
మమ్మును నీ ఆత్మతో నింపినావు నా ప్రభువా
నీకు అసాధ్యమైనది లేనే లేదు నా దేవా 
నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభువా
వందనం అభివందనం దేవ వందనం రాజవందనం
||మహిమ||

-------------------------------------------------------------------
CREDITS : Music: Bro Patrick
Lyrics & Tune, Vocals : Pastor Naveen Paul 
-------------------------------------------------------------------