** TELUGU LYRICS **
మాట తప్పనివాడవు నీవే యేసయ్యా
మాట ఇచ్చి నెరవేర్చే రాజువు నీవయ్యా (2)
వేలాది స్తోత్రాలు స్తుతులు నీకయ్యా
మార్పులేని నీ ప్రేమకు వందనాలయ్యా (2)
మాట ఇచ్చి నెరవేర్చే రాజువు నీవయ్యా (2)
వేలాది స్తోత్రాలు స్తుతులు నీకయ్యా
మార్పులేని నీ ప్రేమకు వందనాలయ్యా (2)
దావీదుతో నీవు మాట ఇచ్చినావయ్య
సత్య ప్రమాణమే నీవు చేసినవయ్యా (2)
అభిషేకమిచ్చావు రాజునే చేశావయ్య
శాశ్వత నీ కృపను చూపించినావయ్యా (2)
స్థాపించినావయ్య నిత్య సింహాసనమే (2)
యాకోబుతో నీవు మాట యిచ్చినావయ్యా
వాగ్దాన భూమికే నడిపించావయ్యా (2)
ఇశ్రాయేలని బ్రతుకునే మార్చావయ్యా
ఒంటరియైన వాణ్ణి గొప్ప జనం చేసావయ్యా (2)
కునుకక నిద్రించక కాపాడుచున్నావు (2)
నీవు నా దాసుడవు నేను నిన్ను మరువనని
పేరు పెట్టి పిలిచావు భయపడకన్నావు (2)
వాగ్దానమిచ్చావు కృపతో నడిపావు
నీ పాద సేవలో నన్ను నిలబెట్టావు (2)
నిన్ను నే విడువనని తోడై యున్నావు
ఎన్నడెడబాయనని నాలో వున్నావు
ఆరాధన నీవే - నా ఆశయు నీవే
----------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Lyrics, Tune, Vocal : Bro. Raju Pallikonda
----------------------------------------------------------------