5223) భయపడను నేను నీవు నాకు తోడైయున్నావయ్యా

** TELUGU LYRICS **

భయపడను నేను - నీవు నాకు తోడైయున్నావయ్యా 
దిగులుపడను - నేను నీ సొంతము 
నీవు నాతో ఉండగా - నెమ్మదిగానే ఉందును 

జలములలోబడి - నే వెళ్ళునపుడు
జలగోషములు - నన్నేమి చేయవుగా 
జలములనేలే దేవాధిదేవ 
తోడున్నావు నీవు - నేను భయపడను 
భయపడకుము - నేను నీకు తోడైయున్నానంటివే 

గాఢాంధకారమైన, లోయయైన 
కలవరపడను - నాతో నీవున్నావయ్యా 
లోయలో నేను - నడచినవేళా 
తోడున్నావు నీవు - నన్ను కాచెదవు 
భయపడకుము - నేను నీకు తోడైయున్నానంటివే 

నిబ్బరముకలిగి ధైర్యముగానుండుము - అని నాతో నీవు మాట్లాడితివే 
దిగులుపడకుము జడియకుము - అని పలికిన దేవ - వందనం వందనం 
వందనం నీకే వందనం నీకే 
ఆరాధన ఆరాధన - నీకే 

భయపడను నేను - నీవు నాకు తోడైయున్నావయ్యా 
దిగులుపడను - నేను నీ సొంతము 
నీవు నాతో ఉండగా - ధైర్యముగానే ఉందును

-----------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Pas. T. Finny David, Samy Pacchigalla
Lyrics, Tune, Music : Pas. T. David Babu, T. Finny David
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------------------