5224) కొలిమిలో కాలుతున్న ఇనుప తునకనయ్య

** TELUGU LYRICS **

కొలిమిలో కాలుతున్న ఇనుప తునకనయ్య
నీకు ఇష్టమైనట్లుగా నన్ను చేయమయ్యా
నీ మందిరాన నీ రూపులోన నన్ను నిలుపుము యేసయ్య
నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపు యేసయ్య

నీవు నన్ను పరిశోధించిన రోజున
నేను సువర్ణమైతిని
నీవు నన్ను చేరుకున్న క్షణమున
నేను పరిమళముగా మారుతిని
ఎంతో గొప్ప భాగ్యము దేవా నీకే స్తోత్రము
ఎంత ధన్యుడనో నిన్నే కొలుతును

నీవు నన్ను ఆకర్షించిన దినమున
నాకు వేరే ఆశ లేదయ్యా
అభయమిచ్చు నీదు రెక్కల చాటున
నాకు భయము లేనే లేదయ్యా
నీదు అరాచేతిలో నన్ను చెక్కు కొంటివి
నా జీవితాంతము ఆరాధింతును

----------------------------------------------------------------------------
CREDITS : Music : Dhinakaran Charles Kalyanapu
Vocals : AnnaRokkjaer (Vijay Kumar Kondru)
Lyrics & Tune : Surekha Konamanchali
----------------------------------------------------------------------------