5222) నీ కృప లేకుండా నేనేల జీవించగలను

** TELUGU LYRICS **

నీ కృప లేకుండా నేనేల జీవించగలను 
నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను 
ఊహించుటయే నా వల్ల కాదయ్యా - ఆలోచించుంటే నా గుండె బరువాయగా (2)
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా (2)

నా దుఃఖ స్థితిలో ఓదార్చినది - నా ఒంటరి పయనంలో తోడై నిలచినది (2)
నీ కృపయే నా పక్షమై నిలచి - నాకై పోరాడి విజయమునిచ్చినది (2)
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా 

దారి తప్పిపోయినను దరి చేర్చినది - ఏ పాపము నెంచక కౌగలించినది (2)
ఎట్టి అర్హత చూడలేదు - నాలో యోగ్యత కోరలేదు (2)
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి - కృపయే మార్గమై నడిపించుచున్నది (2)
దీనుల యెడల కృప చూపు వాడవు - మారని ప్రేమతో ప్రేమించు వాడవు 
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా

---------------------------------------------------------
CREDITS : Music : Immi Johnson
Lyrics, Tune, Vocal : Pas. Shalem Raj
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------