4849) నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా

** TELUGU LYRICS **

నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా
ప్రతి క్షణం నీకొరకే బ్రతకాలని ఆశయ్యా (2)
ప్రతి క్షణము నీతోనే
ప్రతి అడుగు నీ కొరకే (2)
నిన్నే కీర్తించెదన్ - కొనియాడెదన్
నీకై బ్రతికెదన్ (2)
||నిరంతరం||

నీటి బుడగ లాంటి నన్ను - నీ హస్తములతో కాచి 
కాపాడిన నా దేవా (2)
నిను విడచి ఉండలేను
నీ మేలులు మరువలేను (2)
నిన్నే స్తుతియించెదన్ - ఘనపరచెదన్
నీకై బ్రతికెదన్ (2) 
||నిరంతరం||

ఎన్నికయే లేని నన్ను - నీ ప్రేమ తో హత్తుకొని
బలపరచిన నా దేవా (2)
నిను వదిలి బ్రతుకలేను - నీ ప్రేమను మరువలేను
నిన్నే ప్రార్థించెదన్ - ధ్యానించెదన్ (2)
నీకై బ్రతికెదన్ (2)
||నిరంతరం||

చెదరిన నా హృదయమును - నీ కృపతో కరుణించి
స్వస్థ పరచిన నా దేవా (2)
నీ సన్నిధి విడువలేను - నీ కృపను మరువలేను(2)
నిన్నే ప్రేమించేదన్ - ప్రకటించేదన్ (2)
నీకై బ్రతికేదన్ (2)
||నిరంతరం||

-----------------------------------------------------
CREDITS : Music : Suresh
Lyrics, Tune : Bandela Naga Raju
-----------------------------------------------------