4848) దేవా నీ దయ లేకపోతే నేనేమవుదునో

** TELUGU LYRICS **

దేవా నీ దయ లేకపోతే నేనేమవుదునో
ప్రభువా నీ కృప లేకపోతే నేనేమవుదునో
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు -
ఈ లోకమందు నా సర్వము నీవే కదా (2)
కన్నీటితో ఎదురు చూస్తున్న నీ కొరకై
దుఃఖముతో ఎదురుచూస్తున్న నీ మేలుకై

క్రీస్తు యేసు నీ ప్రేమ నిజమైనది
క్రీస్తు యేసు నీ ప్రేమ నిత్యమైనది

ప్రేమించిన వారే ద్వేషించగా 
ద్వేషించిన నాకై నీ ప్రాణమివ్వగా
మేలు పొందుకున్న వారే మరచిపోగా 
మరువకనే నన్ను ప్రేమించావుగా 
(క్రీస్తు యేసు)
క్రీస్తు యేసు నీ ప్రేమ ద్వేషించనిది
క్రీస్తు యేసు నీ ప్రేమ మరిచిపోనిది

ప్రేమించే వారే విడిచి వెళ్ళిన 
ప్రేమించని నాకై నీవు మరణించగా 
ఆశించిన వారే నిరాశపరచగా 
కృంగియున్న నన్నే హత్తుకొనెనుగా
(క్రీస్తు యేసు)
క్రీస్తు యేసు నీ ప్రేమ వీడిపోనిది
క్రీస్తు యేసు నీ ప్రేమ మాన్యమైనది

నమ్మదగిన వారికై నేను వెదకగా 
నమ్మదగిన తండ్రిగా నీవే ఉండగా 
విడువని ప్రేమకై నేను చూడగా
విడువని ప్రేమతో రక్షించెనుగా
(క్రీస్తు యేసు)
క్రీస్తు యేసు నీ ప్రేమ నమ్మదగినది
క్రీస్తు యేసు నీ ప్రేమ మారిపోనిది

నీ ఆత్మతో ప్రేమతో నన్ను నింపవా
నిత్యము నన్ను నీలో స్థిరపరచవా
నీ చిత్తమంత నాలో జరిగించవా
క్రీస్తువలె నన్ను మహిమ పరచవా
(క్రీస్తు యేసు)
క్రీస్తు యేసు నీ ప్రేమ ఘనమైనది
క్రీస్తు యేసు నీ ప్రేమ యోగ్యమైనది

నా జీవితాన్ని ఆశీర్వదించవా
సమృద్ధిగా మేలును నాకుచూపవా
ఒంటరైయిన నన్ను విస్తరింపచేయవా
నీవు తెరచిన ద్వారాన్ని ఎవరు వేయలేరుగా
(క్రీస్తు యేసు)
క్రీస్తు యేసు నీ ప్రేమ రమ్యమైనది
క్రీస్తు యేసు నీ ప్రేమ స్థిరమైనది

---------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune: John Bhaskar M
Music & Vocals : Anil Aldrin & Ravi Sankar R
---------------------------------------------------------------------