** TELUGU LYRICS **
నీ పలుకే నీ పిలుపే నన్ను బ్రతికించునది
నీ స్వరమే నన్ను జీవింప చేయునది
నా యేసు దేవా - నా జీవనాధా
నీ కృపయే నాకు చాలయ్య
నా ఆపదలలో నా వెంట నుండి నన్ను నడిపించితివి
నీ చేయి ఎన్నడు నన్ను విడువదని వాగ్దానం చేసితివి
నీ చల్లని నీ మెల్లని స్వరమే చాలయ్య
నీ స్వరమే మేలయ్య
నీ రెక్కల నీడలో నన్ను దాచి యుంచితివి
నా ముదిమిలో కూడా ఎత్తుకుందునని నాకభయమిచ్చితివి
నిన్ను విడచి నే బ్రతుక లేను నీ తోడే చాలయ్య
నీ తోడే మేలయ్య
----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Joshua Krupakar
Music & Vocals : Sunil Kumar Y & Deva Priya
----------------------------------------------------------------------