** TELUGU LYRICS **
నీ వాక్కును పంపి ఆదరించితివే
నీ కృపలతో నింపి ధైర్యపరచితివే
అ.ప. ప్రభువా ప్రభువా నీకే మహిమ
చుట్టూ గాడంధకారం వెలుగే లేని సమయం
ఎటు తోచని నా పయనం గమ్యం ఎరుగని తరుణం (2)
నీ దర్శన కాలమందు నేను మొరలిడగా
నీ వాక్కును వెల్లడి పరచి వెలుగు నింపితివే (2)
వేదన నిండిన హృదయం నెమ్మది లేని సమయం
అవమానాల వలయం ఆశలు విడిచిన తరుణం (2)
నీ మందిర ఆవరణములో ఆశతో చేరగా
నీ తేజోమహిమతో నింపి శాంతి నొసగితివి (2)
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Gunaveer Paul
Vocals & Music : Sudha Gunaveer Paul & Avinash Ansel
---------------------------------------------------------------------------------------