4855) నాయింటి యందు నాకు క్షేమము లేదయ్య

** TELUGU LYRICS **

నాయింటి యందు నాకు - క్షేమము లేదయ్య
నా గృహము నందు నాకు - సమాధానము లేదయ్య (2)
ప్రార్థిస్తున్నా ప్రభువా నీ దయను చూపయ్య
వేడుకుంటున్న దేవా! నీ దారిని చూపయ్య (2)
యేసయ్య - యేసయ్యా - యేసయ్యా - యేసయ్య (2)

కృంగుదల నా హృదయములో 
కలవరముతో నా గుండె చెదరి 
ఆశలే ఆవిరై - వేదనలే నా మదిలో (2)
నా గుండె బరుపై భారమై నీ సన్నిధిలో విలపిస్తున్నా   
||యేసయ్య||

కఠినులు నా జీవితాన్ని
నడివీధికి నను లాగివేయగా
వ్యర్థుల మాటలు హేళనలతో 
లోకపు వలయం ముంచివేయగా (2)
నా గుండె బరువై భారమై - నీ సన్నిధిలో విలపిస్తున్నా
||యేసయ్య||

-------------------------------------------------------------
CREDITS : Vocals : Lillian Chirstopher
Lyrics, Tune, Music : Bro Rakesh Paul 
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------