4856) మండించు ప్రభువా నీ ఆత్మ నాలో ప్రకాశించెద నీ ప్రతిబింబమై

** TELUGU LYRICS **

మండించు ప్రభువా నీ ఆత్మ నాలో - ప్రకాశించెద నీ ప్రతిబింబమై
రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను (2)
అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను (2)

అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా (2)
పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా 
||అభిషేకించయా||

అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో (2)
ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ
||అభిషేకించయా||

ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా (2)
మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా 
||అభిషేకించయా||

----------------------------------------------------
CREDITS : Music : Prashant RP
Lyrics, Tune : Bro. Gunaveer Paul
----------------------------------------------------