** TELUGU LYRICS **
బాధ ఉందని - బ్రతకలేనని
నీకు నీవే మోసపోతూ బ్రతుకుచుంటివా
ప్రేమ విఫలమై - చావు మేలని
ఉరి కోయ్యకు నిన్ను ఎక్కించుకుంటావా
నవ మాసాలు మోసే తల్లి ప్రేమ మరిచి
పెంచిన తండ్రిని విడిచి - వెళ్ళిపోతావా
దేహంతో దేవుని పని ఉందని మరిచి
కట్టె విడిచి నరకంలో కాలిపోతావా
||బాధ ఉందని - బ్రతకలేనని||
పంటలు పండకుంటే ప్రాణం ఇవ్వాలా
ప్రాణంకు ఉన్న విలువ - గుర్తించలేవా
పరీక్ష ఫెయిల్ అయితే చంపుకోవాలా
దేహం ఎంత గొప్పదో గుర్తించరాదా
ఎంత వేల ఇచ్చిన ప్రాణం తిరిగి వచ్చునా
అవయవాలు అమ్మే దుఖానాలున్నాయా
దేహం వెనుక కష్టం - దేవునిది లేదా
అవయవాలన్నీ తను చేయలేదా
ప్రాణంకు విలువ ఇచ్చే జీవులను చూడు
ఎన్ని శ్రమలు ఉన్న - ప్రాణం తీసుకోవు
దేవుడిచ్చిన ప్రాణం వృధా చేస్తావా
కలకాలం కాలుటకు - తొందర పడతావా
||బాధ ఉందని - బ్రతకలేనని||
బిడ్డ బరువైతే తల్లి మోయాలి అది
నొప్పులు వద్దంటే బిడ్డ - ఎక్కడున్నది
నష్టంలోనే అనుభవం ఉన్నది
కష్టం లేకుంటే విజయమెక్కడున్నది
చీకటి వెనక వెలుగు వస్తూ ఉంటుందిగా
వెలుగు కొరకు చీకటిని భరింయించాలిగా
కంటిలో నలుసు పడితే కన్నీరు తియ్యదా
హృదయంలో వేదనలు - ప్రభువు తీయలేడా
అడగకుండానే అన్ని ఇచ్చేవాడు
బాధలలో నీకు గుర్తు రాలేదా
పాపులు కోసమే ప్రాణమిచ్చినాడు
ప్రార్థిస్తే ఏదైనా నీకు చేయలేడా
||బాధ ఉందని - బ్రతకలేనని||
నీకు నీవే మోసపోతూ బ్రతుకుచుంటివా
ప్రేమ విఫలమై - చావు మేలని
ఉరి కోయ్యకు నిన్ను ఎక్కించుకుంటావా
నవ మాసాలు మోసే తల్లి ప్రేమ మరిచి
పెంచిన తండ్రిని విడిచి - వెళ్ళిపోతావా
దేహంతో దేవుని పని ఉందని మరిచి
కట్టె విడిచి నరకంలో కాలిపోతావా
||బాధ ఉందని - బ్రతకలేనని||
పంటలు పండకుంటే ప్రాణం ఇవ్వాలా
ప్రాణంకు ఉన్న విలువ - గుర్తించలేవా
పరీక్ష ఫెయిల్ అయితే చంపుకోవాలా
దేహం ఎంత గొప్పదో గుర్తించరాదా
ఎంత వేల ఇచ్చిన ప్రాణం తిరిగి వచ్చునా
అవయవాలు అమ్మే దుఖానాలున్నాయా
దేహం వెనుక కష్టం - దేవునిది లేదా
అవయవాలన్నీ తను చేయలేదా
ప్రాణంకు విలువ ఇచ్చే జీవులను చూడు
ఎన్ని శ్రమలు ఉన్న - ప్రాణం తీసుకోవు
దేవుడిచ్చిన ప్రాణం వృధా చేస్తావా
కలకాలం కాలుటకు - తొందర పడతావా
||బాధ ఉందని - బ్రతకలేనని||
బిడ్డ బరువైతే తల్లి మోయాలి అది
నొప్పులు వద్దంటే బిడ్డ - ఎక్కడున్నది
నష్టంలోనే అనుభవం ఉన్నది
కష్టం లేకుంటే విజయమెక్కడున్నది
చీకటి వెనక వెలుగు వస్తూ ఉంటుందిగా
వెలుగు కొరకు చీకటిని భరింయించాలిగా
కంటిలో నలుసు పడితే కన్నీరు తియ్యదా
హృదయంలో వేదనలు - ప్రభువు తీయలేడా
అడగకుండానే అన్ని ఇచ్చేవాడు
బాధలలో నీకు గుర్తు రాలేదా
పాపులు కోసమే ప్రాణమిచ్చినాడు
ప్రార్థిస్తే ఏదైనా నీకు చేయలేడా
||బాధ ఉందని - బ్రతకలేనని||
--------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : S.Upendra
Musc : Prasanth Penumaka
--------------------------------------------------------