4822) పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు ఆరాధ్యుడవు అతి సుందరుడవు

** TELUGU LYRICS **

పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు
ఆరాధ్యుడవు అతి సుందరుడవు 
యేసయ్యా నీ రక్తధారలు 
శుద్ధి చేసెనయ్యా నా పాప డాగులు యేసయ్యా నా 

పాపము మానలేని కన్నులు గలవాడను
మోహపుచూపులతో మదమెక్కిన వాడను 
నీ జ్ఞానమూ నేను త్రోసివేయుచున్ననూ 
జీవముతో నింపితివి జయోత్సాహమిచ్చితివి

తాపకరమైన నాగుల విషమును
చిందిస్తూ మాటలతో గాయపరచువాడను 
నీ మాటను నేను లెక్క చేయకున్ననూ 
మేలులెన్నో చేసితివి మర్యాదను నేర్పితివి 

గర్వముతో నిండిన హృదయపు గిన్నెను
పగతీర్చుకొనుటలో ప్రావీణ్యుడను 
నీ ప్రేమను నేను తూలనాడుచున్ననూ 
పరిశుద్ధత నిచ్చితివి పరలోకం చేర్చితివి 

-------------------------------------------------------
CREDITS : Jesus Charan Ministries
-------------------------------------------------------