4829) ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా

** TELUGU LYRICS **

ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా
పదివేలలో అతి సుందరుడా నీవే మా పూజ్యనీయుడ
సెరాపులు కెరుబులతో 
ఆరాధింప బడుతున్న పరిశుద్దుడా (2)
తండ్రి దేవ తండ్రిదేవ నీవే అతిశ్రేష్ఠనీయుడవు
తండ్రి దేవ తండ్రిదేవ నీవే బహుకీర్తనీయుడవు (2)

నిరంతరం మారనివాడ నా యేసయ్య
అనుక్షణం కొనియాడదగినది నీ నామం (2)
నా హృదయమే నీ సింహాసనం
నాలో నివసించే నిరంతరం (2)

నిత్యము నీలో నేను నిలిచియుండాలని
ప్రతీదినం నాతో నీవు కలిసియుండాలని (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు
నీలో ఫలియించే భాగ్యమునిమ్ము (2)

అంకితం నీ ప్రేమకై నా జీవితం 
నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం (2)
ఊహించలేనే నీ దయలేనిదే
నా బ్రతుకు శూన్యం నీ కృపలేనిదే (2)

--------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Prudhvi raj, Praveenritmos
Lyrics, Tune & Music : Prudhvi Raj & Sareen Imman
--------------------------------------------------------------------------------