4765) వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు

** TELUGU LYRICS **

వినయపూరిత స్తుతి గాన ధూపము
పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగ
హృదయ పీఠము తన వశము చేసెద
ప్రభుత చేయ వడిగ హృదిని ప్రభువు చేరగ
ప్రధమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును

సకల దూత దళ సమేత గగన సీమను
కొలువు తీరు దేవ దేవ భువిని చేరగ
నిఖిల శ్రీకర నీ చరణ పూజకు
ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును

| సగరిసాని | సా, ససా | సగరిసాని | సా | 
| సగగ గాస | గమగమనిప | గారిసాని | సా | 
బలులు నీకు నెనరుకాదు పరమ యాజక
అమలమైన ఆత్మ నీకు అమిత లాలస
తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా
ప్రియమార వినయాన సమర్పింతును

----------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Composed  By Fr Gnana Pragasam sdb
Lyrics & Music & Vocals : M. Prem Kumar & Naveen & Anjana Sowmya
----------------------------------------------------------------------------------------------------------------