** TELUGU LYRICS **
నా రాజా నా దేవా నా పలుకులను ఆలింపుము (2)
నా నిట్టూర్పులు దయతో వినుము (2)
నీ సాయముకొరకై మొరపెట్టితిని
||నా రాజా||
వేకువనే నీకు విన్నపము చేసెదను
ప్రాతఃకాల ప్రార్ధనను నీకే అర్పింతును (2)
నా పలుకులు ఆలించి నన్ను ఆదరింతువని (2)
నీ అనుగ్రహమునకై వేచియుందును
||నా రాజా||
మోదముతో నేను సన్నిధిని చేరెదను
సత్కార్యాల యోచనకై నిన్నే ధ్యానింతును (2)
నా క్రియలను వీక్షించి నన్ను ఆదుకొందువని (2)
నీ కనికరమునకై వేడుకొందును
||నా రాజా||
------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Composed By Fr Gnana Pragasam sdb
Vocals & Music & Lyrics : Sri Krishna & Naveen & Santhaiah Madanu
------------------------------------------------------------------------------------------------------------