4766) సృష్టికర్త ఉత్తముడైన దేవా ఆకాశములో నీ మహిమను చూపువాడ

** TELUGU LYRICS **

సృష్టికర్త ఉత్తముడైన దేవా
ఆకాశములో నీ మహిమను చూపువాడ 
సృష్టికర్త ఉత్తముడైన దేవా
ఆకాశములో నీ మహిమను చూపువాడ
భుమిలో నీ నామము ఎంతో ప్రభావము కలది
నీ హస్తకళను పరిగణించిన పుట్టును భయమూ ఆశ్చర్యము 
ఇవిగో నా కృతజ్ఞతాస్తుతులు
ఓ దేవా అతిశ్రేష్టమైన వాడ 
ఇవిగో నా కృతజ్ఞతాస్తుతులు 
ఓ దేవా అతిశ్రేష్టమైన వాడ 

రూపింపబడక మునుపే నన్ను
రహస్యమందు సృజి యించితివా  
కనుపాపవలె కాపాడు వాడా
నా బదులు మరణము పొందితివా
నీ క్రియలు పరిశీలింప తరమా నీ ప్రేమా గ్రహింపశక్యమా
నీ క్రియలు పరిశీలింప తరమా నీ ప్రేమా గ్రహింపశక్యమా
ఇవిగో నా కృతజ్ఞతాస్తుతులు
ఓ దేవా అతిశ్రేష్టమైన వాడ
ఇవిగో నా కృతజ్ఞతాస్తుతులు
ఓ దేవా అతిశ్రేష్టమైన వాడ 

నీ ప్రేమ నుండి నను వేరు చేయవు
ఒంటరినై ఉండగ తోడుందువు 
పెనుగాలుల అలజడిలో నే చిక్కి యుండగ
నీ సన్నిధితో నన్ను కాయువాడవు 
నీ మాట నెరవేరు నెల్లపుడు 
నీ స్వరము నెమ్మది నిచ్చును
నీ మాట నెరవేరు నెల్లపుడు 
నీ స్వరము నెమ్మది నిచ్చును
ఇవిగో నా కృతజ్ఞతాస్తుతులు
ఓ దేవా అతిశ్రేష్టమైన వాడ 
ఇవిగో నా కృతజ్ఞతాస్తుతులు
ఓ దేవా అతిశ్రేష్టమైన వాడ

-----------------------------------------------------------------------------
CREDITS : Vocals : Sean Talluri, Susanna Geddam
Lyrics & Music : Rhoda Talluri & Anand Pianolover
-----------------------------------------------------------------------------