4810) నీ వశమౌదును స్వాధీనమౌదును

** TELUGU LYRICS **

నీ వశమౌదును - స్వాధీనమౌదును 
పరవశమొందుచు - నీ ఆరాధనలో 
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

నిను ప్రేమించెద - నిను సేవించెద
నీదు ప్రేమను నే - చాటించెదను
||యేసయ్య||

ఆలయమౌదును - వాహనమౌదును
సాధనమునై నే - నీ పక్షముందును
||యేసయ్య||

నీ దండుజేరిన - నీ బంటునైతిని
నీ యుద్ధములనే - పోరాడెదన్
||యేసయ్య||

కడ బూర మ్రోగగా కను రెప్పపాటున
మార్పు చెందెదన్ నిన్ను చేరుకొందున్
||యేసయ్య||

-----------------------------------------------------
CREDITS : Pas. T. Jafanya Sastry
-----------------------------------------------------