4811) దేవా నిన్ను తలచి నన్ను నేనే మైమరచి

** TELUGU LYRICS **

దేవా నిన్ను తలచి - నన్ను నేనే మైమరచి 
పదే పదే నీ ప్రేమను - అదే పనిగా తలపోయుచు 
దినమంతా నీ ధ్యాసలో - బ్రతుకంతా గడిపేస్తున్నా (2) 
||దేవా||

తెలిసి తెలిసి నేరములెన్నో - చేసి చేసి నీ గాయము రేపి 
పాపంబులోనే మరణించిపోక -నీ రుధిరంబుతో (2)
నన్ను రక్షించితివే - నా స్థితిని మార్చితివే
||దేవా||

తిరిగి తిరిగి లోక వ్యసనాలతో - నశియించిపోయే ఈ పాపిని 
క్షమియించినీవు తొలగించినావు - నా శిక్షావిధి (2)
మితిలేని నీ ప్రేమతో - నీ పాత్రగా మార్చితివే
||దేవా||

-------------------------------------------------
CREDITS : Vocals : Bro.Suresh
Lyrics, Music : Bro.Vijay Suresh
-------------------------------------------------