4800) నీ కృపకనికరము ఆ కల్వరిలో కనపరిచినావు

** TELUGU LYRICS **

నీ కృపకనికరము ఆ కల్వరిలో కనపరిచినావు 
నీ ప్రేమ జాలియు నా స్థితి పై చుపించినావు (2)
నీకే నా ఆరాధన - స్తుతి ఆరాధన నీకే (2)
||నీ కృపకనికరము||

నీ ప్రేమను మరచి దూరమైతిని దేవా
ఒంటరినై నేను తిరిగి వచ్చితిన్ (2)
నీ చేతులు చాపి కౌగలించితివి ప్రభువా 
నన్ను పట్టి ముద్దు పెట్టి చేర్చుకొంటివి
యోగ్యతే లేని నాపై కనికరింతివి ప్రభువా 
నీదు నన్ను యోగ్యునిగా చేసితివి
||నీకే నా ఆరాధన||

నా దుఃఖ కన్నీటితో ప్రార్థించితిని దేవా
ఓదార్పు లేని నాకు తండ్రివైతివి (2)
నా ఆలోచనలన్ని యెరిగియుంటివి ప్రభువా 
నా ఆశలన్నియు తీర్చితివి
విరిగిన మనస్సే నీకిష్టమైయున్నది
సజీవయాగముగా సమర్పింతును 
||నీకే నా ఆరాధన||

నాకున్న బలముతో పోరాడితిని దేవా
ఓడి పోయే నన్ను నీవు గెలిపించితివి (2)
నీ అధికశక్తి చేత అతిశయించితిని ప్రభువా
నాకు ఇచ్చిన విజయం నీదే గదా
నా శక్తిచేత కాదు నీ ఆత్మతోనే ప్రభువా
నాకున్నవన్నియు నీవే గదా
||నీకే నా ఆరాధన||

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor Shanthi Vardan Rao
Music & Vocals : John Pradeep & Samuel Joshi
-------------------------------------------------------------------------