** TELUGU LYRICS **
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము (2)
||ఆనందము||
ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే (2)
జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా (2)
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా (2)
||ఆనందము||
తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము (2)
||ఆనందము||
ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే (2)
జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా (2)
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా (2)
||ఆనందము||
వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి (2)
పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు (2)
తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు (2)
||ఆనందము||
తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము (2)
నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు (2)
వెండి బంగారములైన సాటిరాని సంపదలు (2)
||ఆనందము||
-----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tunes : K.Satya Veda Sagar Garu
Singer & Music : Nissi John Garu & JK. Christopher Garu
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------------------