** TELUGU LYRICS **
అయ్యా నా యేసయ్య నీ ప్రేమ శాశ్వతము
అయ్యా నా యేసయ్య నీ కృపయే శాశ్వతము
నీ మాటకు లోబడితే నా వంశములన్నిటనూ
అయ్యా నా యేసయ్య నీ కృపయే శాశ్వతము
నీ మాటకు లోబడితే నా వంశములన్నిటనూ
దీవెన వర్షమునే గడిగడియకు చూసెదను
ఆశీర్వాద శిఖరముపై నా గుడారమేయుటకు
కొలతలులేని కనికరము నాపైన నిలిపావు
ఆశీర్వాద శిఖరముపై నా గుడారమేయుటకు
కొలతలులేని కనికరము నాపైన నిలిపావు
చూపులతోనే పాపమును సంపూర్ణం చేసాను
పొరుగువాని ప్రతి భాగమును నిత్యం ఆశించువాడను
తేనెకంటే నునుపైన పదములు కురిపించి
వేషధారినై జీవిస్తూ ముందుకు సాగితిని
మేలు చేయాలనుకున్నా కీడును మానలేకున్నా
పితరుల నడవడి నాలోనా శ్వాసగా మారింది
అపవాది బంధీగా చెరగొనిపోయెను
మనుష్యుల ఊహకందనంత చీకటి అయ్యాను
తెలియనిదేదీ లేదంటూ అన్నీ నాకే తెలుసంటూ
వాక్యమునెరిగిన నిపుణుల మాటలు గారడి పలుకులు అన్నాను
తర్కములు చేయుటయే సువార్త అనుకున్నా
వాదములో గెలుచుటయే నీసేవనుకున్నా
----------------------------------------------------------
CREDITS : Music : Daniel John
Lyric, Tune, Sung : Bro.Prakash Garu
----------------------------------------------------------