4820) శరణము నీవే యేసయ్య నా ఆధారమైనావయ్యా

** TELUGU LYRICS **

శరణము నీవే యేసయ్య నా ఆధారమైనావయ్యా
పరిశుద్ధుడవు నీవయ్యా నను నీ వలె మార్చావయ్యా
స్తుతియాగము నీకే అర్పింతును
కృపలోనే నిత్యము జీవింతును
ఆధారం కృపయే
ఆనందం నీలోనే
అతిశయం నీ కృపయే
ఆశ్రయం నీలోనే

కరుణామూర్తిగా దిగివచ్చిన
కరములు చాపి కరుణించిన
కలుషము బాపి నను మార్చిన
కనికరించిన నీ కృప
నీ కృపలోనే ఆ
నీ కృపలోనే నాకు క్షేమము
నీ కృపయే నా ఆధారము
ఆ కృపలోనే నన్ను నడిపించవా

నిజ స్నేహితుడవు నీవేనయ్యా
నను ప్రేమించిన సాత్వీకుడా
నిరతము నన్ను ఎడబాయక 
నడిపించినదీ నీవేనయ్యా
మార్గము నీవే ఆ
మార్గము నీవే సత్యము నీవే
మరణము గెలిచిన జయశీలుడా
మమ్ము కొనిపోగా రానున్న మహనీయుడా

--------------------------------------------------------------------
CREDITS : Music : Bro. Gotikala Joshua
Lyrics, Tune, Vocals : John Reinhard Blessy
--------------------------------------------------------------------