4693) నీదు పాదములే నమ్మినానయ్యా దీనులను కాచే భారం నీదెగా

** TELUGU LYRICS **

నీదు పాదములే నమ్మినానయ్యా
దీనులను కాచే భారం నీదెగా

సతతం పాపభరితం అయిన ఈ భువిపై
సతతం పాపభరితం అయిన ఈ భువిపై
ప్రార్ధనయనెడి ఖడ్గముతో
ధైర్యముగ నిల్చి - సైతానున్ గెల్చి
పరమందు నిల్చు - బలమిమ్ము యేసుదేవా.
నీదు పాదములే నమ్మినానయ్యా

మదిలో నీదు స్మరణే మరువక కొలిచే
మదిలో నీదు స్మరణే మరువక కొలిచే
విడువక నీ పాదాబ్జములే
నిరతంబు కొలుచు - భాగ్యమ్మునిమ్ము 
కృపచూపి మమ్ము - దరిచేర్చు మమ్ము దేవా

నీదు పాదములే నమ్మినానయ్యా
దీనులను కాచే భారం నీదెగా

------------------------------------------------
CREDITS :
------------------------------------------------