4694) చేతకాక పోయినా ఫలితమేమి తేకున్నా నిను వీడలేకున్నా

** TELUGU LYRICS **

చేతకాక పోయినా ఫలితమేమి తేకున్నా
నిను వీడలేకున్నా ప్రార్థన మానలేకున్నా

సింహపు నోటనుండి ఎలుగుల చేతినుండి
నీ గొర్రెపిల్లలను కాపాడలేకున్నా
ఉపవాస ప్రార్థనతో కన్నీటి రోదనతోనూ
నీ ప్రజల ప్రాణాలకూ. అడ్డుపడలేకున్నా

సృష్టికర్త వీవనీ గొప్ప రక్షణిచ్చినావనీ 
నిత్యములో నీతో నివసింపనిస్తావనీ
ఎరిగియున్నందునే నీ చిత్తం కొరకూ
ప్రార్థన చేయుట మానలేకపోతున్నా

దేహంలో ఉండగా విజ్ఞాపన ప్రార్థనతో
యాచన రోదనతో స్వీకరింపబడ్డావా 
మహిమకు తరలుటకు 
నీ రీతే మాదిరిగా
మంటిలో మూల్గుటే నా శేష జీవితం

-----------------------------------------------------
CREDITS : Pst. T. Jafanya Sastry
-----------------------------------------------------