4692) ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే

** TELUGU LYRICS **

ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే 
ఏ మంచిలేని నన్ను నీవు - నీ నీతిగా చేసావే (2)
నీ త్యాగము మరువనయ్యా - నీ ప్రేమను విడువనయ్యా 
నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే 
||ఎందుకో||

పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా
నీ ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే (2)
జీవము లేని నీ నాకు - జీవమునిచ్చావే (2)
||నీ త్యాగము||

నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు 
పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే (2)
చాలయ్య యేసు నీ ప్రేమ - నాకందించావే (2)
||నీ త్యాగము||

నీ పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము 
అను నిత్యమూ నీ ప్రియనామమును - నేను ఘణపరచెదను (2)
జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు నీ కొరకే (2)
||నీ త్యాగము||

-------------------------------------------------------------------
CREDITS : Music : Ganta Ramesh
Lyrics & Vocals : Pastor Korneli & Sireesha
-------------------------------------------------------------------