4709) నీ అరచేతిలో నేనున్నాని తెలిసి అనాధని మరిచిపోతినే

** TELUGU LYRICS **

నీ అరచేతిలో నేనున్నాని తెలిసి 
అనాధని మరిచిపోతినే
నీ కనుచూపులో నేనున్నాని తెలిసి
కన్నీళ్ళు ఆగకున్నదే
మరణపు అంచులో మరువని దేవా - శరణపు నీడలో దాచిన దేవా

తోడుగా ఉన్నవారే నన్ను మోడుగా చేసేరు 
అండగా ఉన్నవారే నన్ను దండగేనన్నారు  
తోడుగా నీడగా నా వెంట ఉంటివే (2)
పాడైన బ్రతుకుని ఫలియింప జేస్తివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా

చెంతగా ఉన్నవారే నన్ను చెడుగా చూసేరు 
సొంతమన్న వారే నన్ను గుంతలో తోసారు
వింతగా ప్రేమించి ఉన్నతం ఎక్కించి 
దారిద్య్ర  బ్రతుకునే దీవింప జేస్తివే 
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా

కారణమూ నేనేగా - ఇల నమ్మడం తప్పెగా
దారుణం జరిగాక నేను మరణమే కోరగా 
కొడుకా కూతురా తండ్రి నే ఉన్నానని 
తన ప్రేమ కోగిలిలో కాచుకుంటివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా

--------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune :  Paul Jacob
Music & Voclas : Nanlu Anna & Nandini 
Youtube Link : 👉 Click Here
--------------------------------------------------------------