4710) నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా

** TELUGU LYRICS **

నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా 
నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా 
నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె 
నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె 
హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో (2)
నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును (2)
||నూతన||

ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు 
అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు (2)
నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు 
సేవించు వారిని ఘనపరచెదవు (2) 
నీ ప్రేమ వర్ణించలేనయా - నీ కృప వివరించలేనయా (2)
||హల్లెలూయ||

నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు 
కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు (2)
మాటయిచ్చి తప్పని వాడవు 
వాగ్దానమును స్థిరపరచు వాడవు (2)
నీ సంకల్పము గ్రహింతును - నీ చిత్తమునే జరిగింతును (2)
||హల్లెలూయ||

తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో 
క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును (2)
పరిశుద్ధాత్మతో నేసాగెదను 
పరిశుద్దులతో నేనుండెదను (2)
నాకెంతో భాగ్యమయా - నాకెంతో ధన్యతయా (2)
||హల్లెలూయ||

----------------------------------------------------------
CREDITS : Vocals : Akshaya Praveen
----------------------------------------------------------