** TELUGU LYRICS **
మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా
ఎన్నడైన భూమి చూడని మనసయ్యా (2)
ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించితివే (2)
మిన్నకుండలేము యేసయ్యా కనుగొని నీ ప్రేమను
ఎన్నతరమే కాదయ్యా లోతైన ఆ ప్రేమను
||మిన్నయైన||
ఎన్నడైన భూమి చూడని మనసయ్యా (2)
ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించితివే (2)
మిన్నకుండలేము యేసయ్యా కనుగొని నీ ప్రేమను
ఎన్నతరమే కాదయ్యా లోతైన ఆ ప్రేమను
||మిన్నయైన||
ద్రోహము చేసి దోషము మోపిరి
కేకలు వేసి సిలువకు నెట్టిరి
పండ్లు కొరికి చెంపలు పెరికిరి
ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి
శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా (3)
||మిన్నయైన||
నరుడని ఎంచి హేళన చేసిరి
శక్తిని ప్రశ్నించి నిను శంకించిరి
సవాలు విసిరి అవమానించిరి
ఛీత్కరించి వెకిలిగ నవ్విరి
సామర్థ్యము కలిగీ సహించుట సాధ్యమా (3)
||మిన్నయైన||
అలసిన నిన్ను బహు విసిగించినా
ఓటమి పాలై నిరాశ పరచినా
ఫలములు లేని తీగెగా మిగిలినా
మరలా మరలా నిను సిలువేసినా
వేధించిన కొలది ప్రేమించుట సాధ్యమా (3)
||మిన్నయైన||
-----------------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Prabhod Kumar Adusumilli
Music & Vocals : Praveen Chokka & Mohammed Irfan
-----------------------------------------------------------------------------------