** TELUGU LYRICS **
సర్వోన్నతుడు సర్వ శక్తి మంతుడు సమస్తము సృష్టించిన విశ్వనాధుడు
మృత్యుంజయుడు యుధ్ధమందు సూర్యుడు
మరణ బలం విరచిన యేసునాధుడు
అసాధ్యమన్నదేది లేని గొప్ప దేవుడు
సర్వ మానవాళికి జీవనాధుడు
యేసే దేవుడు యేసయ్య దేవుడు
సిలువలో ప్రాణమునిచ్చి
మరణపు ముల్లును విరచి
మృతుంజయుడిగ లేచితివి నీవే యేసయ్యా (2)
నీకు సాటిలెరయ్య నిన్ను పోలి ఎవరయ
సర్వ శక్తిమంతుడవు యేసయ్యా (2)
నిన్ను ఆరాధించి కీర్తింతును పునారుధనములో
ఆరాధన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన (3)
||సిలువలో||
ఎన్నడును ఉండకుండా మరణమును మ్రింగివేయ
సింహాసనమునువీడి సిలువను మోసితివి (2)
చీకటి నిండిన బ్రతుకులో వెలుగును నింపిన దేవుడవు
శాపము పాపము తొలగించి విడుదలనిచ్చిన ధీరుడవు
||నీకుసాటి లేరయ్య|| ||సర్వోన్నతుడు||
పరమందలమును వీడి మహిలో నరునిగా మారీ
వాక్యము నెరవేర్చితివి ఘనుడవు యేసయ్య (2)
యుగములనాటి నిరీక్షణకు ఫలితముగా ధిగివచ్చితివి
పరిశుద్ధ రక్తము చిందించి పాపిని శుద్ధికరించితివి
||నీకుసాటి లేరయ్య|| ||సర్వోన్నతుడు||
-------------------------------------------------------------------------
CREDITS : Music & Vocals : Eli moses
Vocals : John Chakravarthi
Lyrics & Tune : Edurumondi John Chakravarthi
-------------------------------------------------------------------------