4716) ఇదియే అనుకూల సమయం రక్షణ భాగ్యం పొందుమా

** TELUGU LYRICS **

ఇదియే అనుకూల సమయం
రక్షణ భాగ్యం పొందుమా
నీ పాపం ఒప్పుకో 
నీ శాపం తొలగును
నిత్య రాజ్యానికి వారసులౌదువు

పాపం వలన వచ్చు జీతం మరణం
నీ పాపం వలన వచ్చు జీతం మరణం
ఆ మరణపు ముల్లును త్రుంచిన 
యేసుని నమ్ముకో
ముక్తి భాగ్యం దొరుకును

రక్తం వలన  పాప విమోచన కలుగును
క్రీస్తేసుని రక్తం వలన పాప విమోచన కలుగును
ఆ మృత్యుంజయుని వేడుమా 
పాప విముక్తి పొందుమా 
పరమపురి ప్రాప్తించును

------------------------------------------------------
CREDITS : Music : Jakie Vardhan
Lyrics, Tune, Vocals : Snigdha Roy
------------------------------------------------------