4737) ఆదరించు వారు లేరని అలసిపోయినా కృంగుబాటుతో నేను కుమిలి పోయినా

** TELUGU LYRICS **

ఆదరించు వారు లేరని అలసిపోయినా
కృంగుబాటుతో నేను కుమిలి పోయినా (2)
నన్ను బలపరచెను నీ కృపా
నన్ను నడిపించెను నీ కృపా (2)
నీ కృపయే లేనిదే నేను లేనయ్యా నా యేసయ్య
యేసయ్య కృపామయ
నను నడిపించావయ్యా నాతో నడిచావయ్యా
యేసయ్య దయామయ 
నను విడువలేదయ్యా 
నను మరువ లేదయ్యా

ప్రేమ చూపు వారికోసం పరితపించినా
శోకమంత నిండి గుండెలో కలత చెందినా (2)
నాకై దిగి వచ్చెను నీ కృపా
నన్ను ప్రేమించెను నీ కృపా
నాకై మరణించెను నీ కృపా
నన్ను రక్షించెను నీ కృపా

పాపినైన నన్ను చేరదీసినావయ్యా
రక్తమిచ్చి ప్రాణమిచ్చి నన్ను కొన్నావు (2)
ఆశ్రయం దొరికెను ఆదరణ కలిగెను
శాంతినిచ్చు నీ మాటలలో జీవమిచ్చు నీ వాక్యములో
నెమ్మది దొరికెను ప్రేమయు దొరికెను
జాలి నిండిన కన్నులలో
ప్రేమ నిండిన నీ హృదయముతో 
నను హత్తుకుంటివయ్యా
నను చేర్చుకుంటివయ్యా
నను ముట్టుకుంటివయ్యా ముద్దాడినావయ్యా (2)
యేసయ్య ప్రేమామయా
నీ ప్రేమే చాలయ్యా నీవే చాలయ్యా (2)

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Pastor Andrew Son
Music : Daniel Carey & John Eben
---------------------------------------------------------------------------------