** TELUGU LYRICS **
యేసుని చెంత - నీ చింతపోవును
నీ హృదయమంతా - నింపుకో యేసుని
సాధ్యం సాధ్యం యేసులో సాధ్యం (2)
నీ హృదయమంతా - నింపుకో యేసుని
సాధ్యం సాధ్యం యేసులో సాధ్యం (2)
యాయీరు కూతురు మరణించినను
యేసుని నమ్మినందున - జీవించి నడిచెను
నమ్మి చూడు యేసుని - నిత్యజీవమిచ్చును
పన్నెండేండ్ల రోగముతో - బాధపడిన స్త్రీ
యేసుని విశ్వసించి - విడుదల పొందెను
నమ్మి చూడు యేసుని - విమోచన నిచ్చును
ఆకాశపక్షులను - పోషించే దేవుడు
నీ చింత యావత్తు - తీర్చును ఎల్లప్పుడు
నమ్మి చూడు యేసుని - మేలులెన్నో చేయును
-----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Sis. Susan Undru
Music & Vocals : J K Christopher & Sis Lillian Christopher
-----------------------------------------------------------------------------------------