** TELUGU LYRICS **
నీ కృపతో నింపిన నా జీవితం
మహోన్నత సేవకే అంకితం
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచ్చెను
సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను
నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో
అనుదినము స్తుతి పాడేదా (2)
మహోన్నత సేవకే అంకితం
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచ్చెను
సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను
నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో
అనుదినము స్తుతి పాడేదా (2)
ఉన్నత స్థలములలో నన్ను నడిపించే
నీదు సంకల్పము
ఊహకు మించిన కార్యము చేయుటయే
నీకే సాధ్యము (2)
నా మధుర గీతికా నీవేనయ్యా
నీ మహిమతో నన్ను నింపుమయ్యా (2)
పిలుపుకు తగినట్లు జీవించుటయే
నీదు చిత్తము
నీతిమంతులమై మొవ్వవేయుదాము
నీదు సన్నిధిలో (2)
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయ్య (2)
అందని శిఖరముపై నన్ను నిలుపుటకు
యాగమైతివి
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును
నీదు రాకకై (2)
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయ్య (2)
---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pr.William Carey & Esther
Vocals & Music : Lillianchristopher & JK Christopher
---------------------------------------------------------------------------------