4675) నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా

** TELUGU LYRICS **

నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా 
అన్ని వేళల తోడుండిన నా ప్రాణ నాథా 
ప్రతీ రేయి ప్రతీ పగలు ఆరాధన నీకేనయ్య స్తుతి యాగము నే చేసెదా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా యేసయ్యా

వట్టి పాత్రగానే నేను నీ సన్నిధికి చేరితి 
ఎన్నతగని వాడను నేనని నీ యెదుటే విలపించితిని
అనాధగా నన్ను విడువక నా దరి చేరితివి 
అనాధగా నన్ను విడువక నీ కౌగిలిలో చేర్చుకొంటివి
ఆరాధనా ఆరాధనా అరాధనా యేసయ్యా (2)

నిన్ను విడిచిన సమయంలో అపజయాలే కలిగెనుగా
నాకు కలిగిన నిందలలో కృంగినేను కృశించగా
ఒంటరిగా నన్ను విడువక నా పక్షమై నిలిచితివి
ఒంటరిగా నన్ను విడువక జయధ్వనులతో నడిపితివి
ఆరాధనా ఆరాధనా అరాధనా యేసయ్యా (2)

నాదు విశ్వాస పోరాటములో నీవాక్కుకై పరుగెత్తితిని
ఆపదలెన్నో నన్ను చుట్టుకొనగా నీవైపేనే చూచితిని
ఏకాకినై నేనుండగా నీ కృపను చూపితివి 
ఏకాకినై నేనుండగా నీ ప్రేమతో ఆదుకొంటివి 
ఆరాధనా ఆరాధనా అరాధనా యేసయ్యా (2)

-----------------------------------------------
CREDITS :
-----------------------------------------------