** TELUGU LYRICS **
ఆలోచనకర్తవైన నా దేవా
నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
ఇదియే త్రోవని - నా వెంట నుండి
ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు
నా ముందు నడుచుచు - ద్వారములు
తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు
నా ముందు నడుచుచు - ద్వారములు
తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు
నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు
ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు
మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు
ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి
నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి
కరుణించుచు నీవు - కృపలను జూపుచు
ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు
--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Bro. K.Salman Raju Garu
Music & Vocals :Sareen Imman & Chinny Savarapu
--------------------------------------------------------------------------------