** TELUGU LYRICS **
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచువలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే (2)
ఉన్నత బహుమానం నీవు పొందెదవు
పక్షిరాజు వలె పైకి ఎగిరెదవు (2)
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే (2)
ఉన్నత బహుమానం నీవు పొందెదవు
పక్షిరాజు వలె పైకి ఎగిరెదవు (2)
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే
ఇప్పుడు నీకుఉన్న నీ శత్రువులను ఇకపై ఎన్నడును చూడబోవులే (2)
నీ పక్షముగా యుద్ధము చేసి వారిపై నీకు విజయమునిచ్చి (2)
నీ తోడుగ నేనుందును నిన్ను విడువను (2)
||నా సన్నిధి నీకు||
ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును ఇకపై ఎన్నడును రానివ్వనులే (2)
నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి నిత్యానందము నీపై ఉంచి (2)
నీ తోడుగ నేనుందును ఆశీర్వదింతును (2)
||నా సన్నిధి నీకు||
ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నియును రెండంతలుగాను నీవు పొందుకొందువులే (2)
శాశ్వతమైన ప్రేమను చూపి విడువక నీ యెడ కృపలను ఇచ్చి (2)
నా ఆత్మతో నిన్ను నింపెదను నిన్ను నడిపెదను (2)
||నా సన్నిధి నీకు||
----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
----------------------------------------------