4672) సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై

** TELUGU LYRICS **

సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు
సదా తోడు నిలిచావు నా అండవై (2)
భయమేమీలేదు నా బలము నీవే
ఓటమే లేదు నా జయము నీవే (2)
అభినందనం నీకే నా యేసయ్యా
అభిషిక్తుడా నీకే నా ఆరాధన (2)
||సరిరారయ్యా||

దివిలో ఉన్న దీవెనలన్నీ
భువికే దించిన బహుఘనుడవు (2)
నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ
సిరులను కురిపించే శ్రీమంతుడవు  (2)
||అభినందనం||

ఎదురౌతున్న పోరాటాలలో
నాతో నిలిచిన బహుశూరుడా (2)
నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి
జయ జీవితమిచ్చే విజయకరుడా (2)
||అభినందనం||

మంటి ఘటమైన నాలో నీవు
మహిమైశ్వర్యమును నింపితివి (2)
మారని నీ కృపతో నీ మమతల కోటలో
జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా (2)
||అభినందనం||

----------------------------------------------
CREDITS :
----------------------------------------------