4683) విధిరాతనంతటిని సౌభాగ్యం చేయుటకు భూమికి పునాది లేనపుడు

** TELUGU LYRICS **

విధిరాతనంతటిని సౌభాగ్యం చేయుటకు
భూమికి పునాది లేనపుడు నా రూపము గీసితివి (2)
జగములలో అందరికీ దేవుడు నీవంటూ 
తరతరాలకు నీ కృపలో మార్పు లేదంటూ 
నా మనసువిప్పి పాడతానయా నీకు చేతులెత్తి మొక్కుతానయ 
||విధిరాతనంతటిని||

కంటికి ఇంపుదైనదంత నన్ను చెరపకుండ
నా కంటి పాప మీద సిలువ ముద్ర వేసినావు (2)
శుద్ధత నేర్పావయ్యా నీ పరిశుద్ధతకు వందనమయ్యా (2)
||జగములలో||

యుగయుగాల నరకములోకి జారిపడిపోకుండా 
నాలుకకు వాడుకైన అబద్ధములు మాన్పినావు (2)
సత్యము రుచిచూపావయ్య నీ సత్యముకు వందనమయ్యా (2)
||జగములలో||

హానిచేసిన వారిని గూర్చి సణిగిగొనగకుండా 
అంతరంగ నరములలోని జ్ఞాపకములను చెరిపావు (2)
మేలులు చేసావయ్యా నీ మేలులకు వందనమయ్యా (2)
||విధిరాతనంతటిని||

---------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
---------------------------------------------